15, జనవరి 2014, బుధవారం

ALISHETTI PRABHAKAR JAYANTHI, VARDANTHI SANDARBHAMGAA NAMASTE TELANGANA BATHUKAMMA 2012 JANUARY LO PRACHURITAM







    



14, జనవరి 2014, మంగళవారం

నమస్తే తెలంగాణ  బతుకమ్మ లో అలిశెట్టి ప్రభాకర్ జయంతి ,వర్ధంతి సందర్భంగా ప్రచురితం అయినది.



అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా వివిద పత్రికలలో వచ్చిన వ్యాస చిత్రాలు

                                 






22, నవంబర్ 2013, శుక్రవారం

దగ్ధం చేసి 
మమ్మల్ని
బూడిద చేయడం తప్ప 
మా బతుకంతా 
రంధ్రాలు పొడిచి 
రక్తాలు పీల్చడం తప్ప 
మీరేం చేయగలర్రా 
అందుకే 
చిందిన ఈ నెత్తురూ
చిట్లిన ఈ పుర్రెలూ
మీ రాజకీయాల ఇస్తాట్లో
వొడ్డిస్తాం ......... రండిరా

                       --------అలిశెట్టి ప్రభాకర్

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

సిటీ లైఫ్ 4

ఎప్పటికీ
ఊడిపోని

ఒక ప్రేమ జంటే
డెకోలమ్ - ప్లైవుడ్


----అలిశెట్టి ప్రభాకర్

ఉఛ్ఛ్వాస

నువ్విప్నుడొక
విత్తనానివి
రేపు పూసే చిగురుకి
సరికొత్త ఊపిరివి
మరి...
మొలకెత్తకముందే
అలసిపోయి
చచ్చిపోకు.
చచ్చిపోతూ
బలవంతంగా
మొలకెత్తకు.
లోలోపలే
సమాధివయితే
సయించదు మట్టికూడా
వెలుపలికి
కుతుహలంగా చొచ్చుకొస్తే
ఆకాశమంత ఎత్తునే చూస్తావు.

--అలిశెట్టి ప్రభాకర్