22, నవంబర్ 2013, శుక్రవారం

దగ్ధం చేసి 
మమ్మల్ని
బూడిద చేయడం తప్ప 
మా బతుకంతా 
రంధ్రాలు పొడిచి 
రక్తాలు పీల్చడం తప్ప 
మీరేం చేయగలర్రా 
అందుకే 
చిందిన ఈ నెత్తురూ
చిట్లిన ఈ పుర్రెలూ
మీ రాజకీయాల ఇస్తాట్లో
వొడ్డిస్తాం ......... రండిరా

                       --------అలిశెట్టి ప్రభాకర్

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

సిటీ లైఫ్ 4

ఎప్పటికీ
ఊడిపోని

ఒక ప్రేమ జంటే
డెకోలమ్ - ప్లైవుడ్


----అలిశెట్టి ప్రభాకర్

ఉఛ్ఛ్వాస

నువ్విప్నుడొక
విత్తనానివి
రేపు పూసే చిగురుకి
సరికొత్త ఊపిరివి
మరి...
మొలకెత్తకముందే
అలసిపోయి
చచ్చిపోకు.
చచ్చిపోతూ
బలవంతంగా
మొలకెత్తకు.
లోలోపలే
సమాధివయితే
సయించదు మట్టికూడా
వెలుపలికి
కుతుహలంగా చొచ్చుకొస్తే
ఆకాశమంత ఎత్తునే చూస్తావు.

--అలిశెట్టి ప్రభాకర్

19, సెప్టెంబర్ 2013, గురువారం

సిటీ లైఫ్ 3

నిరుద్యోగ దుర్గంధం
సొకనంత పరిమళం
కాలుష్యం కాలూనని
నగరమంతా నందనం
హైదరాబాదు
విశ్వవిద్యాలయమా !
నీకిదే ....
అభివందనం

             --అలిశెట్టి ప్రభాకర్ 

సిటీ లైఫ్ 2

గండు పిల్లిలా
నీ చూపు
కొండ చిలువలా
నీ చేయి
పై పైకి పాకుతోంటే
జలదరిస్తోందే
జనం మేను
రాజకీయమా ....!?

                 --అలిశెట్టి ప్రభాకర్ 

సిటీ లైఫ్

రాడికల్స్ ని
గద్దలా
తన్నుకుపోయ్యే
ప్రభుత్వం
రారమ్మని
గద్దర్ని
ఆహ్వానిస్తుంది
ఎందుకో
అతని పాటిపుడు
ముద్దోస్తుందా ....!?

              --అలిశెట్టి ప్రభాకర్

12, ఆగస్టు 2013, సోమవారం

నువ్వు వంగి వంగి
దండం పెడుతున్నంత సేపూ
ఆ దండమే వానికి పునాది
............
.............
"ఇదిగో దొరా
నా రక్త మాంసాల్నే నీకు పెట్టుబడిగా
సమర్పిస్తున్నా" నంటే
అవిగోరా నీ లాభం
ఆ ఎముకల్లో మిగిల్చాననే
పెత్తందారీ సర్పం వాడు



-- అలిశెట్టి ప్రభాకర్ 
సభ

ఆకలి
అధ్యక్షతన
ఖాళీ కడుపే
ఒక బహిరంగ  సభ
నినదించే
పేగులే
జనం.

--అలిశెట్టి ప్రభాకర్