24, జనవరి 2012, మంగళవారం

         వాత్సాయనుడు  చెప్పిన  64 కళలు
  1.  గీతము.
  2. వాద్యము
  3. నృత్యము 
  4. విశేషకచ్చేదము
  5. తండుల కుసుమ వలీ వికారము 
  6. పుష్పాస్తరణము
  7. దసనవ సనాంగ రాగము 
  8. మణిభూమికా కర్మ 
  9. ఆలేఖ్యము 
  10. శయన రచనము 
  11. ఉదక వాద్యము 
  12. ఉదకా ఘాతము 
  13. చిత్ర యోగము 
  14. మాల్య గ్రథన వికల్పము
  15. శేఖరకాపీడ యోజనము 
  16. నేపథ్య ప్రయోగము 
  17. కర్ణ పత్ర భంగము 
  18. భూషణ యోజనము 
  19. ఐంద్ర జాలము 
  20. కౌచు మారము
  21. హస్త  లాఘవము 
  22. గంధ యుక్తి 
  23. విచిత్ర శాఖ మూష భక్ష్య  వికార క్రియ 
  24. పానక రాగ సవా యోజనము 
  25. సూత్రా క్రీడ 
  26. సూచీవాన కర్మ 
  27. ప్రహేళిక 
  28. ప్రతి మాల
  29. దుర్వాచక యోగములు 
  30. పుస్తక వాచనము  
  31. కావ్య సమస్య పూరణము
  32. నాటకాఖ్యాయికా  దర్శనము 
  33. తక్ష కర్మ 
  34. పట్టికావేత్ర వాన వికల్పము 
  35. తక్షణము 
  36. వాస్తు విద్య 
  37. రూప్య రత్న పరీక్ష
  38. ధాతు వాదము 
  39. మణిరాగాకార జ్ఞానము 
  40. వృక్షాయుర్వేద యోగము 
  41. మేష కుక్కుట లావక యుద్ద విధి 
  42. శుక శారికా ప్రలాపనము 
  43. ఉత్సాదన సంవాహన  కేశమర్దన కౌశలము 
  44. అక్షర ముష్టి కాక ధనము 
  45. దేశ భాషా విజ్ఞానము 
  46. పుస్పశకటిక
  47. నిమిత్త జ్ఞానము 
  48. మ్లేచ్చాతా వికల్పము 
  49. యంత్ర మాతృక 
  50. ధారణ మాతృక 
  51. ఛందో జ్ఞానము 
  52. మానసీ
  53. కార్య క్రియ 
  54. అభిధాన కోశము 
  55. సంపాట్యము
  56. ఛలికత యోగములు 
  57. క్రియ కలము
  58. వస్త్ర గోపనము 
  59. ద్యూతము 
  60.  అకర్ష క్రీడ 
  61.  బాల క్రీడనకము 
  62.  వైనయికీయ విద్య 
  63. వైజయకీయ విద్య 
  64. వ్యాయావకాన విద్య

       మన ఆలంకారికులు చెప్పిన 64 కళలు
    1.  ఇతిహాసము 
    2. ఆగమము
    3. కావ్యము 
    4. అలంకారము 
    5. నాటకము
    6.  గాయకత్వము
    7.  కవిత్వము
    8. కామశాస్త్రము
    9.  దురోదరం జ్ఞానము 
    10. దేశభాష లిపి
    11.  లిపికర్మము 
    12. వాచకము
    13. అవధానము 
    14. సర్వశాస్త్రము 
    15. శాకునము
    16. సాముద్రికం
    17. రత్న శాస్త్రము 
    18. రథాశ్యాగజ కౌశలము
    19. మల్ల శాస్త్రము 
    20. సూద కర్మము
    21. దహదము
    22. గంధవాదము 
    23. ధాతువాదము
    24. ఖనివాదము
    25. రస వాదము 
    26. జల వాదము
    27. అగ్ని స్తంభము 
    28. ఖడ్గ స్తంభము
    29. జల స్తంభము
    30. వాక్ స్తంభము
    31. వయ స్తంభము
    32. వశ్యము 
    33. ఆకర్షణము 
    34. మోహనము 
    35. విద్వేషము
    36. ఉచ్చాటనము 
    37. మారణం
    38. కాలవంచనం 
    39. పరకాయ ప్రవేశం
    40. పాదుకాసిద్ధి 
    41. ఐంద్రిజీవితం 
    42. అంజనం 
    43. ద్రుష్టిచనం
    44. సర్వ వంచనం 
    45. మణి మంత్రేషధాదిక సిద్ధి
    46. చొర కర్మం 
    47. చిత్త క్రియ
    48. లోహ క్రియ 
    49. అశ్వ క్రియ
    50. మృత్క్రియ
    51. దారు క్రియ 
    52. వేణు క్రియ 
    53. చర్మ క్రియ  
    54. అంబర క్రియ
    55. అదృశ్యకరణం 
    56. దూతీకరణం
    57. వాణిజ్యం 
    58. పాశు పాలనం 
    59. కృషి 
    60. అసవకర్మం
    61. ప్రానిదూత్రుత కౌశలం 
    62. వాక్సిద్ది 
    63. చిత్రలేఖనం 
    64. సంగీతం


                                                                                                    గండ్ర మహేశ్....

                                                                                            

19, జనవరి 2012, గురువారం

నాకు తెలిసిన కొన్ని గ్రంథాలు 


                         
01అచలాత్మజాపరిణయము
02అచ్చ తెలుగు భారతము
03అచ్చ తెలుగు రామాయణము
04అధ్యాత్మ రామాయణము
05అనర్ఘ రాఘవము
06అనిరుద్ధచరిత్ర
07అనుభవసారము
08అప్పకవీయము
09అష్టమహిషీ కల్యాణము
10అహల్యాసంక్రందనము
11అహోబలపండితీయము
12ఆంధ్రకామందకము
13ఆంధ్రధాతుపాఠము
14ఆంధ్రనామశేషము
15ఆంధ్రనామసంగ్రహము
16ఆంధ్రపదనిధానము
17ఆంధ్రపదార్ణవము
18ఆంధ్రభాషార్ణవము
19ఆంధ్రభాషాభూషణము
20ఆంధ్రనామశేషము
21ఆనందరంగరాట్ఛందము
22ఆముక్తమాల్యద
23ఇందుమతీపరిణయము
24ఉత్తరరామాయణము
25ఉత్తరహరివంశము
26ఉద్భటారాధ్యచరిత్ర
27ఉషాపరిణయము
28ఊర్మిళాదేవినిద్ర
29కకుత్స్థవిజయము
30కళాపూర్ణోదయము
31కవికర్ణరసాయనము
32కవిచౌడప్ప శతకము
33కవిసంశయవిచ్ఛేదము
34కాటమరాజు కథలు
35కామధేనుకథ
36కాశీయాత్రాచరిత్ర
37కాళహస్తీశ్వరమాహాత్మ్యము
38కాళహస్తీశ్వరశతకము
39కాళిందీపరిణయము
40కావ్యాలంకారసంగ్రహము
41కాశీఖండము
42కాశీయాత్రాచరిత్ర
43కిరాతార్జునీయము
44కువలయాశ్వచరిత్ర
45కుక్కుటేశ్వరశతకము
46కుచేలోపాఖ్యానము
47కుమారసంభవము
48కుశలవచరిత్ర (జానపదము)
49కృష్ణరాయవిజయము
50కేయూరబాహుచరిత్ర
51క్రీడాభిరామము
52క్షత్రబంధూపాఖ్యానము
53గాధేయోపాఖ్యానము
54గౌరీవిలాసము
55చంద్రభానుచరిత్ర
56చంపూరామాయణము
57చంద్రాంగదాపరిణయము
58చంద్రరేఖాపరిణయము
59చంద్రికాపరిణయము
60చతుర్వేదసారము
61చారుచంద్రోదయము
62చిత్రకూటమాహాత్మ్యము (యక్షగానము)
63చిత్రభానుచరిత్ర
64చెన్నుమల్లుసీసములు
65చొక్కనాథచరిత్ర
66జైమినిభారతము
67తంజాపురాన్నదానమహానాటకము (యక్షగానము)
68తరిగొండ నృసింహ శతకము
69తపతీసంవరణోపాఖ్యానము
70తారాశశాంకము
71తాలాంకనందినీపరిణయము
72తాళ్లపాక అన్నమయ్య కీర్తనలు
73త్రిపురాంతకోదాహరణము
74దక్షిణహిందూదేశశాసనములు
75దశకుమారచరిత్ర
76దశావతారచరిత్ర
77దాశరథీశతకము
78దేవీభాగవతము (యక్షగానము)
79ద్విపదభారతము
80ద్విపదరామాయణము
81ద్విపద సారంగధరచరిత్ర
82ధనాభిరామము
83ధనుర్విద్యావిలాసము
84ధాతుమాల
85నరసింహశతకము
86నలచరిత్ర
87నల్లసోమనాద్రికథ
88నవనాథచరిత్ర
89నానారాజసందర్శనము
90నాసికేతూపాఖ్యానము
91నిరంకుశోపాఖ్యానము
92నిర్వచనోత్తరరామాయణము
93నీతిచంద్రిక
94నీతిశాస్త్రముక్తావళి
95నీతిశతకము
96నీలాసుందరీపరిణయము
97నుడికడలి
98నృసింహపురాణము
99నెల్లూరుశాసనములు
100శృంగారనైషధము
101పక్షికోశము (మరాఠీ)
102పంచతంత్రము
103పంచతంత్రము (నారాయణకవి)
104పంచతంత్రము (వేంకటనాథకవి)
105పంచకన్యాపరిణయము (యక్షగానము)
106పండితారాధ్యచరిత్ర
107పద్మనాభయుద్ధము
108పరమయోగివిలాసము
109పర్వతాల మల్లారెడ్డి కథ (జానపదము)
110పల్నాటి వీరచరిత్ర
111పాంచాలీపరిణయము
112పాండవాశ్వమేధము
113పాండురంగమాహాత్మ్యము
114పాణిగృహీత
115పారిజాతాపహరణము
116పారిజాతాపహరణము (యక్షగానము)
117పార్వతీపరిణయము
118ప్రద్యుమ్నచరిత్ర
119ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము
120ప్రబోధచంద్రోదయము
121ప్రభావతీప్రద్యుమ్నము
122ప్రభులింగలీల
123ప్రహ్లాదచరిత్రము (యక్షగానము)
124ఫిరదౌసి
125బలుమూరు కొండయ్య కథ (జానపదము)
126బసవపురాణము
127బహుళాశ్వచరిత్ర
128బేతాళపంచవింశతి
129బొబ్బిలియుద్ధము
130భద్రగిరిశతకము
131భద్రాపరిణయము
132భల్లాణచరిత్ర
133భద్రాయురభ్యుదయము
134భానుమద్విజయము
135భార్గవపురాణము
136భాస్కరరామాయణము
137భాస్కరశతకము
138భీమఖండము
139భోజరాజీయము
140భోజసుతాపరిణయము
141మనుచరిత్ర
142మన్నారుదాసవిలాసము
143మల్లభూపాలీయము
144మల్హణచరిత్ర
145మాతపురాణము
146మార్కండేయపురాణము
147ముకుందవిలాసము
148మైరావణచరిత్ర
149మొల్లరామాయణము
150యయాతిచరిత్ర
151రంగనాథరామాయణము
152రంగారాయచరిత్రము
153రసికజనమనోభిరామము
154రాజవాహనవిజయము
155రాఘవాభ్యుదయము
156రాజవాహనవిజయము
157రాజగోపాలవిలాసము
158రాజశేఖరచరిత్రము
159రాజమోహనకురవంజి (యక్షగానము)
160రాజారామేశ్వరరావు (జానపదము)
161రాధామాధవము
162రాధికాసాంత్వనము
163రామలింగేశ్వరశతకము
164రామరామశతకము
165రామలింగేశ్వరశతకము
166రామాభ్యుదయము
167రామాయణకల్పవృక్షము
168రాయవాచకము
169రావిపాటిగురుమూర్తిశాస్త్రి వ్యాకరణము
170రుక్మాంగదచరిత్ర
171రేఫఱకారనిర్ణయము
172లక్షణసారసంగ్రహము
173లీలావతీకల్యాణము (యక్షగానము)
174వరాహపురాణము
175వల్లభాభ్యుదయము
176వసుచరిత్రము
177వాదజయము (యక్షగానము)
178వాల్మీకిచరిత్ర
179వాసంతికాపరిణయము (యక్షగానము)
180వాసిష్ఠరామాయణము
181విష్ణుపురాణము
182విక్రమార్కచరిత్ర
183విజయవిలాసము
184విజ్ఞానేశ్వరీయము
185విప్రనారాయణచరిత్ర
186వివేక విజయము (యక్షగానము)
187విశ్వేశ్వరశతకము
188విష్ణుపురాణము
189విష్ణుమాయావిలాసనాటకము
190విష్ణుపారిజాతము
191వీరభద్రవిజయము
192వృషాధిప శతకము
193వెలుగోటివారి వంశావళి
194వేంకటేశాంధ్రము
195వేంకటేశ్వరవిహారశతకము
196వేంకటేశాంధ్రము
197వేంకటేశ్వరవిహారశతకము
198వేణుగోపాలశతకము
199వేమనశతకము
200వైకృతదీపిక
201వైజయంతీవిలాసము
202శకుంతలాపరిణయము
203శచీపురందరము (యక్షగానము)
204శతకంఠరామాయణము
205శరభాంకలింగశతకము
206శశాంకవిజయము
207శశిరేఖాపరిణయము
208శాసనశబ్దకోశము
209శివరాత్రిమాహాత్మ్యము
210శివతత్త్వసారము
211శివలీలావిలాసము
212శిశుపాలవధ
213శుకసప్తతికథలు
214శుక్రనీతిసారము
215శుద్ధాంధ్రనిఘంటువు
216శృంగారనైషధము
217శృంగారశాకుంతలము
218శృంగారసావిత్రి
219శేషధర్మములు
220శ్రవణానందము
221శ్రీరంగమాహాత్మ్యము
222శ్రీరామాయణము
223షట్చక్రవర్తిచరిత్ర
224షోడశకుమారచరిత్ర
225సకలనీతిసమ్మతము
226సర్వాంధ్రసారసంగ్రహము
227సంక్షేపరామాయణము (జానపదము)
228సంస్కృతపదార్ణవము
229సకలనీతిసమ్మతము
230సతీదానశూరము (యక్షగానము)
231సత్యభామాసాంత్వనము
232సదాశివరెడ్డికథ (జానపదము)
233సర్వేశ్వరశతకము
234సాంబనిఘంటువు
235సాంబోపాఖ్యానము
236సానందోపాఖ్యానము
237సారంగపాణిపదములు
238సారంగధరచరిత్ర (ద్విపద)
239సారంగధరచరిత్ర (చంపూకావ్యము)
240సావిత్రీచరిత్ర
241సింహాసనద్వాత్రింశిక
242సింహగిరివచనములు
243సింహాద్రినారసింహశతకము
244సీతారామాంజనేయసంవాదము
245సుకవిమనోరంజనము
246సుదక్షిణాపరిణయము
247సుమతిశతకము
248బసవ పురాణం
249సౌందరనందము
250హంసవింశతి
251హరవిలాసము
252హరివంశము
253హరివంశము (ఉత్తరభాగము)
254హరిశ్చంద్రోపాఖ్యానము (గౌరన)
255హరిశ్చంద్రోపాఖ్యానము
256హేమాబ్జానాయికా స్వయంవరము






గండ్ర....

6, జనవరి 2012, శుక్రవారం

                 -:ఛందస్సు:-




వృత్తాలు :-

౦౧ )  ఉత్పలమాల :  భ ర న భ భ ర వ
౦౨ )  చంపకమాల:  న జ భ జ జ జ ర
౦౩ )  శార్దూలము :  మ స జ స త త గ
౦౪ ) మత్తేభము :  స భ ర న మ య వ
౦౫ )  మత్తకోకిల  : ర స జ జ భ ర
౦౬ )  తరలము : న భ ర స జ జ గ
 ౦౭ )  స్రగ్ధర : మ ర భ న య య య
౦౮ ) మహా స్రగ్ధర :  స త త న స ర ర గ
౦౯ ) భుజంగ ప్రయాతము: య య య య
౧౦ ) పంచ చామరము:  జ ర జ ర జ గ
౧౧ )  వసంత తిలకము : త భ జ జ గగ
౧౨ )  స్రగ్విణి : ర ర ర ర
౧౩ ) తోటకము:  స స స స
౧౪ )  మాలిని: న న మ య య
౧౫ )  మానిని :  భ భ భ భ భ భ భ గ
౧౬ ) లయగ్రాహి : భ జ స న భ జ స న భ య
౧౭ )  స్వాగత వృత్తము : ర న భ గ గ
౧౮ )  మందాక్రాంతము : మ భ న త త గగ
౧౯ ) కవిరాజ విరాజితము : న జ జ జ జ జ జ వ
౨౦ ) ప్రహరణకలిత :  న న భ న వ
౨౧ )  సుగంధి :  ర జ ర జ ర
౨౨ )  వనమయూరము :  భ జ స న గగ
౨౩ ) మనోహరిణి : న య స స
౨౪ )  ఇంద్రవంశము  : త త జ ర
౨౫ ) వనమంజరి : న జ జ జ జ భ ర
౨౬ )  కమల విలసితము : న న న న గగ
౨౭ ) కరిబృంహితము :  భ న భ న భ న ర
౨౮ ) వసంతమంజరి  : న భ భ న ర స వ
౨౯ )  మంజుభాషిణి : స జ స జ గ

జాతులు:- 

 ౦౧ )   కందము:  గ గ భ జ స న ల 
 ౦౨ )   ద్విపద :   ఇంద్ర గణములు మూడిన గణంబొకటి 
                          చంద్రాస్య ద్విపదకు జను జప్పరేచ                           
  ౦౩ )   తరువోజ : --------
  ౦౪ )  అక్కరలు :
               అక్కరల లో  భేదాలు:-
                   అ ) మహాక్కర 
                   ఆ ) మధ్యాక్కర 
                    ఇ ) మధురాక్కర 
                    ఈ)  అంతరాక్కర 
                    ఉ ) అల్పాక్కర 

           అ ) మహాక్కర : మొదట  సూర్యుండు  పదపగా నింద్రుండు 
                                            మొదలుగా నేవురు  వరలుచుమ్డ్రు 
                                  మెదల    సూర్యుండు  పిమ్మట నేగురు 
                                          పురుహుతులదకంగ జంద్రుడొండు 
                                  ముదము తోనెడ సొచ్చు మహాక్కర 
                                           మొనసి కావ్యములందు  నిడగ కృష్ణ 

              ఆ ) మధ్యాక్కర :   ఇంద్ర గణం +ఇంద్ర గణం +సూర్య గణం +ఇంద్ర గణం + ఇంద్ర గణం+సూర్య గణం 

               ఇ ) మధురాక్కర :    సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం



               ఈ)  అంతరాక్కర :  సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం 

                ఉ ) అల్పాక్కర :     ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం 

౦౫ )  ఉత్సాహ  :    సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +
సూర్య గణం +గురువు  

౦౬ )  త్రిపద     :     ------

౦౭ )  చౌపద :    ఒక్కొక్క పాదమునకు  4  చతుర్మాత్ర గణాలు ఉంటాయి
                         జగణం వాడరాదు   యతి  02 గణం ల మీద 
౦౮ షట్పద  :  
                      షట్పద లో  భేదాలు 
                       అ ) శర షట్పద 
                        ఆ ) కుసుమ షట్పద 
                       ఇ ) భోగ షట్పద 
                       ఈ ) భామినీ షట్పద 
                       ఉ )  పరివర్దిని షట్పద
                       ఊ ) వార్ధక షట్పద 

               అ ) శర షట్పద:       4+4
                                             4+4
                                             4+4+4+2
                ఆ ) కుసుమ షట్పద     :     5 +5
                                                         5 +5 
                                                         5 +5 +5 +2 
               ఇ ) భోగ షట్పద   :        ౩ +౩+౩+౩
                                                  ౩ +౩+౩+౩ 
                                                  ౩ +౩+౩+౩+౩+౩+2 
               ఈ ) భామినీ షట్పద :  3+4+3+4
                                                3+4+3+4
                                               3+4+3+4+3+4+2   
              ఉ )  పరివర్దిని షట్పద :  4+4+4+4
                                                4+4+4+4
                                                4+4+4+4+4+4+2
              ఊ ) వార్ధక షట్పద :  5+5+5+5                       
                                            5+5+5+5
                                            5+5+5+5+5+5+2

౦౯ )  విషమ గీతులు :
                   విషమ గీతులలో భేదాలు 
                  అ ) ఎత్తు గీతి 
                  ఆ ) ప్ర గీతి 
                  ఇ ) మేలన గీతి 
                  ఈ ) మలయ గీతి


ఉపజాతులు:- 

౦౧ )   సీసం :   ఇంద్ర గణములు ఆరు + సూర్య గణములు రెండు 
                     ప్రతి పాదానికి వస్తాయి దీనికి తోడు తేటగీతి  కాని ఆటవెలది కాని వస్తుంది 

౦౨  ) తేటగీతి:   సూర్యుదోక్కడుండు  సుర రాజులిద్దరు
                       దినకర ద్వయంబు తేటగీతి  
                         
౦౩  ) ఆటవెలది :   ఇనగణ త్రయంబు ఇంద్ర ద్వయంబు

                       హంస పంచకంబు నాటవెలది 

౦౪ ) మంజరి ద్విపద : -----

౦౫ ) రగడలు :     -------

                  -:సంధులు:-
 

 సంస్కృత సంధులు :-


౦౧ ) సవర్ణదీర్ఘ్హ సంధి
౦౨ ) సకారాంత సంధి
౦౩ ) శ్చుత్వ సంధి
౦౪ ) ష్టుత్వ సంధి
౦౫ ) ఛత్వ సంధి
౦౬ ) తుగాగమ సంధి
౦౭ ) గుణ సంధి
౦౮ ) వృద్ధి సంధి
౦౯ ) యణాదేశ సంధి
౧౦ ) జస్త్వ సంధి
౧౧ ) అనునాసిక సంధి
౧౨ ) విసర్గ సంధి


                       ...............కొన్ని మాత్రమే


తెలుగు సంధులు:-

౦౧ ) అకార సంధి
౦౨ ) ఉకార సంధి
౦౩ ) ద్విరుక్తటకార సంధి
౦౪ ) టుగాగమ సంధి

                          ...............కొన్ని మాత్రమే

4, జనవరి 2012, బుధవారం

పద్యాలు


                                -: పద్యాలు:-
౦౧      అ ఆ ఐ ఔ లకు మఱి
      
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
       ఉ ఊ ల్దమలో నొడఁబడి
       ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!




౦౨     ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
          శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
          డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
          కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్

ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించాడు పాపరాజు.

౦౩        అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
            ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
           నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
            యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్


౦౪      దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది
         చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
         లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
         బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా
         గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్


౦౫          తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది.
          ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
          రాజభూషణ రజోరాజి నడగు
          ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
          నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
          ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
          మానిత సంపద లీనుచుండు
          ఎవ్వాని గుణలత లేడువారాశుల
          కడపటి కొండపై గలయ బ్రాకు

          నతడు భూరిప్రతాప మహాప్రదీప
          దూర విఘటిత గర్వాంధకార వైరి
          వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
          తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు


౦౬        శ్రీనాథుడు,  శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణించిన పద్యం .           తలమీద చదలేటి దరిమీల దినజేరు
           కొంగలు చెలగి కొంగొంగురనగ
           మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
           బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
           గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
           బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
           గడియంపు బాములు కకపాలలో నున్న
           భూతి మై జిలికిన బుస్సు రనగ

           దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
           దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
           వాడవాడల భిక్షించు కూడుగాని
          యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!


౦౭           నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది.

          నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
          సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
          నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
          దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్



౦౮
          శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
          జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
          దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
          ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై

౦౯               మన్మథుడి  గూర్చి కరుణశ్రీ   గారి పద్యం

         ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
         వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
         తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
         అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే


3, జనవరి 2012, మంగళవారం

పద్యాలు

                             -:  పద్యాలు :-
 ౦౧      ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
            నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
            నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
            నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
 
 ౦౨        ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
           యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
           బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
           డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

౦౩      .సాయంకాలములం దదీశ మురజి త్సద్మస్వనద్దుందుభి
           స్ఫాయత్కాహళికాప్రతిస్వనత దోఁప న్గుంజగర్భంబుల
          న్ర్మోయుం గేళివనిం గులాయ గమన ప్రోత్తిష్ట ద న్తస్సర
           స్స్థాయి శ్వేతగరు ద్గరుత్పటపటాత్కారంబుఁ గ్రేంకారమున్

౦౪       వరమున బుట్టితిన్‌, భరత వంశము జొచ్చితి నందు పాండు భూ
           వరునకు కోడలైతి జన వంద్యుల బొందితి నీతి విక్రమ
           స్థిరులగు పుత్రులన్‌ బడసితిన్‌ సహ జన్ముల ప్రాపు గాంచితిన్‌
           సరసిజ నాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్‌ !

౦౫       ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
            నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
            ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
            పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!
           

                                                                                                             -- గండ్ర మహేష్.... 
          కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు


మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..
 1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.

3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.

4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.

5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.

6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.

8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.

9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.

10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.

11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.

12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.

13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.

15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.

16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు
                                                                                                                        -- గండ్ర మహేష్ ....
                          108 ఉపనిషత్తులు
ఉపనిషత్తులు :-

1 ఈశావాస్యోపనిషత్
2 కేనోపనిషత్
3. కఠోపనిషత్

4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. చాందోగ్యోపనిషత్
10. బృహదారణ్యకోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమృతబిందూపనిషత్
21. అమృతనాదోపనిషత్
22. అథర్వశిరోపనిషత్
23. అథర్వశిఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్
26. బృహజ్జాబాలోపనిషత్
27. నృసింహతా పిన్యుపనిషత్ (పూర్వ తాపిని, ఉత్తర తాపిని )
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యుపనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోఫనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యొపనిషత్
55 రామతాపిన్యుపనిషత్ 9పూరవ తాపిన్యుపనిషత్, ఉత్తర తాపిన్యుపనిషత్ )
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిసషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షకోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. ఆధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతోపనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహృదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మ జాబాలోపనిషత్
88. రుద్రాక్ష జాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. ధర్మనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కృష్ణోపనిషత్
97. యాజ్ఞ్వల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయోపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తాత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్ముపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వృచోపనిషత్
108. ముక్తికోపనిషత్
           -:శ్రీ కృష్ణుని అష్టవివాహాలు:-
           శ్రీ రామ నవమి వచ్చందంటే సీతారామ కళ్యాణాలు వాడ వాడలా   జరిపించి ఆనందిస్తాం కాని శ్రీ కృష్ణాష్టమి కి మాత్రం కళ్యాణాలు జరిపించడం ఎక్కడా చూడనూ  లేదు.
         అష్ట మహిళల శృంగార నాయకుడైన శ్రీ కృష్ణునికి కళ్యాణం జరపడం అన్యాయంగా భావిస్తారు. ఎందుకంటే ఒక నాయిక ను పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపిస్తే మిగిలిన నాయిక లకు కోపం వచ్చి శాపాలు పెడతారు అనే భయం తో కృష్ణుని కల్యాణం ను జరిపించరు. కొద్ది మందికి రుక్మిణి, సత్య భామ లు మాత్రమే తెలుసు మిగిలిన ఆ ఆరుగురి నాయికల గురించి కూడా తెలుసుకుందాము.
        శ్రీ కృష్ణుని ఎనిమిది మంది భార్యల గురించి  తెలుసుకుందాము.....
           


రుక్మిణి :           విదర్భ దేశాదీశుడైన  "భీష్మకుడు"అను రాజు యొక్క కూతురు రుక్మిణి.  ఐదుగురి అన్నలతోడ పుట్టిన  భీష్మకుని వంశ ఆడబిడ్డ గారాల పట్టి రుక్మిణి దేవి .  ర్క్మిని అన్న  అయిన  రుక్మి మాత్రం తన చెల్లెలు అయిన రుక్మిణి ని శిశుపాలుని కి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు కాని రుక్మిణి మాత్రం శ్రీ కృష్ణున్ని ప్రేమించింది ఆ సందర్భం లో రుక్మిణి ఒక బ్రాహ్మణుని సహాయం తో  కృష్ణుని కి తన ప్రేమ విషయం తెలియ పరచి వివాహం చేసుకోవాలని రాయభారము ను పంపించింది. రుక్మిణి దేవి యొక్క మన్ననను  అంగీకరించి లక్ష్మీతో సమనురాలైన రుక్మిణి ని వివాహం చేసుకున్నాడు .

జాంబవతి  :           సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం. కాని వాస్తవానికి ఆ స్థానం జాంబవతిది. సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు తన వద్ద ఉన్న రోజుకి పదహారు బారువుల బంగారం ప్రసాదించే శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న అభాండం పరమాత్మ మీద మోపేడు. అంతట ఆ గోపాలుడు, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్ళాడని తెలుసుకుని అటు వెళ్ళాడు.కాని ప్రసేనుని ఒక సింహం చంపగా ఆ సింహాన్ని ఒక యెలుగుబంటి చంపి ఆ మణిని పట్టుకెళ్ళిన జాడ తెలుసుకుని ఆ యెలుగుబంటితో(పూర్వయుగంలో శ్రీరామబంటు జాంబవంతుడు) 12 రోజులు యుద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న ఆ భక్తాగ్రేసరుడు క్షమాపణ చెప్పుకుని స్వామిని నొప్పించినందుకు శ్యమంతకమణితో పాటు తన కుమారీ మణిని కూడా పరంధామునికి సమర్పించి ధన్యుడయ్యాడు.

సత్యభామ :       
నూతన వధూ సమేతుడై యింటికొచ్చిన గోవిందుడు సత్రాజిత్తుకు జరిగిన కథను చెప్పగా అతను సిగ్గుపడి శ్రీకృష్ణుని బహువిధముల స్తుతించి తన కుమార్తె సత్యభామను స్వీకరించమని కోరి ప్రార్ధించి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తను తరించి, పెద్దలను తరింపజేశాడు. మణిని కూడా సమర్పించాడు. కాని వాసుదేవుడు మణిని తిరస్కరించి కుమారీమణిని తీసుకొని ఇంటికెళ్ళాడు
నాగ్నజితి : కోసల రాజు అయిన నగ్నజితి తన రాజ్యం లో వృషభాలు మదించిన ఏనుగుల మాదిరిగా ఊరిమీదపడి ప్రజలను బాధిస్తుండగా ఆ నాగ్నజితు యెవరైతే వృషభాలను బంధిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని చాటించాడు. పెళ్ళికి ఆశ పడకపోయినా లోకోపకారార్ధం దేవకీ సుతుడు వెళ్లి అనాయాసంగా వృషభాలను బంధించాడు. రాజుగారు అన్నమాట ప్రకారం తన కుమార్తె నాగ్నజితినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు.

కాళింది :    కాళింది సూర్యుని కూతురు . విష్ణు మూర్తి నే భర్తగా చేసుకోవాలని తపస్సు చేసిన పుణ్య స్త్రీ  కాళింది. శ్రీ కృష్ణుడు అతని భావ మరిది అయిన అర్జునుడు కలిసి నదిలో స్నానం చేయదని కి వెళ్ళినప్పుడు ఈ కాళింది కృష్ణుడిని కామ వాంఛ తో చూసింది. ఆ సమయం లో అర్జునుడు ఆమెను చూసి వివరాలు అడిగి తెలుసుకొని కృష్ణునికి చెప్తాడు. కృష్ణుడు ఆమెను ద్వారక కు తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. 
  మిత్రవింద:     శ్రీ కృష్ణుని మేనత్త కూతురు. అవంతీ దేశాధీశులు, యోధానుయోధులు, ధర్మాత్ములు అయిన విందాను విందుల చెలియలు. రాధాదేవి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరమాల వేసి వరించిందీమె.

భద్ర :            శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక. ఈమె సకల సలక్షణ సమన్విత. జాగ్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణునికి యిద్దరు భార్యలు మేనరికం.

లక్షణ :           బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యము నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. ఆమె తండ్రి ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికి కూతురుని ఇస్తానని చాటించాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక నందనందనుడు సునాయాసంగా మత్స్యాన్ని పడేశాడు. లక్షణ తన లక్ష్యం సిద్ధించిందని ఆనందించి వరమాల వేసి వరించింది. శ్రీకృష్ణుడు తనకు అడ్డు వచ్చిన రాజులందరినీ యెదురించి లక్షణని తీసుకుని ద్వారక చేరాడు.