3, జనవరి 2012, మంగళవారం

           -:శ్రీ కృష్ణుని అష్టవివాహాలు:-
           శ్రీ రామ నవమి వచ్చందంటే సీతారామ కళ్యాణాలు వాడ వాడలా   జరిపించి ఆనందిస్తాం కాని శ్రీ కృష్ణాష్టమి కి మాత్రం కళ్యాణాలు జరిపించడం ఎక్కడా చూడనూ  లేదు.
         అష్ట మహిళల శృంగార నాయకుడైన శ్రీ కృష్ణునికి కళ్యాణం జరపడం అన్యాయంగా భావిస్తారు. ఎందుకంటే ఒక నాయిక ను పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపిస్తే మిగిలిన నాయిక లకు కోపం వచ్చి శాపాలు పెడతారు అనే భయం తో కృష్ణుని కల్యాణం ను జరిపించరు. కొద్ది మందికి రుక్మిణి, సత్య భామ లు మాత్రమే తెలుసు మిగిలిన ఆ ఆరుగురి నాయికల గురించి కూడా తెలుసుకుందాము.
        శ్రీ కృష్ణుని ఎనిమిది మంది భార్యల గురించి  తెలుసుకుందాము.....
           


రుక్మిణి :           విదర్భ దేశాదీశుడైన  "భీష్మకుడు"అను రాజు యొక్క కూతురు రుక్మిణి.  ఐదుగురి అన్నలతోడ పుట్టిన  భీష్మకుని వంశ ఆడబిడ్డ గారాల పట్టి రుక్మిణి దేవి .  ర్క్మిని అన్న  అయిన  రుక్మి మాత్రం తన చెల్లెలు అయిన రుక్మిణి ని శిశుపాలుని కి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు కాని రుక్మిణి మాత్రం శ్రీ కృష్ణున్ని ప్రేమించింది ఆ సందర్భం లో రుక్మిణి ఒక బ్రాహ్మణుని సహాయం తో  కృష్ణుని కి తన ప్రేమ విషయం తెలియ పరచి వివాహం చేసుకోవాలని రాయభారము ను పంపించింది. రుక్మిణి దేవి యొక్క మన్ననను  అంగీకరించి లక్ష్మీతో సమనురాలైన రుక్మిణి ని వివాహం చేసుకున్నాడు .

జాంబవతి  :           సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం. కాని వాస్తవానికి ఆ స్థానం జాంబవతిది. సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు తన వద్ద ఉన్న రోజుకి పదహారు బారువుల బంగారం ప్రసాదించే శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న అభాండం పరమాత్మ మీద మోపేడు. అంతట ఆ గోపాలుడు, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్ళాడని తెలుసుకుని అటు వెళ్ళాడు.కాని ప్రసేనుని ఒక సింహం చంపగా ఆ సింహాన్ని ఒక యెలుగుబంటి చంపి ఆ మణిని పట్టుకెళ్ళిన జాడ తెలుసుకుని ఆ యెలుగుబంటితో(పూర్వయుగంలో శ్రీరామబంటు జాంబవంతుడు) 12 రోజులు యుద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న ఆ భక్తాగ్రేసరుడు క్షమాపణ చెప్పుకుని స్వామిని నొప్పించినందుకు శ్యమంతకమణితో పాటు తన కుమారీ మణిని కూడా పరంధామునికి సమర్పించి ధన్యుడయ్యాడు.

సత్యభామ :       
నూతన వధూ సమేతుడై యింటికొచ్చిన గోవిందుడు సత్రాజిత్తుకు జరిగిన కథను చెప్పగా అతను సిగ్గుపడి శ్రీకృష్ణుని బహువిధముల స్తుతించి తన కుమార్తె సత్యభామను స్వీకరించమని కోరి ప్రార్ధించి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తను తరించి, పెద్దలను తరింపజేశాడు. మణిని కూడా సమర్పించాడు. కాని వాసుదేవుడు మణిని తిరస్కరించి కుమారీమణిని తీసుకొని ఇంటికెళ్ళాడు
నాగ్నజితి : కోసల రాజు అయిన నగ్నజితి తన రాజ్యం లో వృషభాలు మదించిన ఏనుగుల మాదిరిగా ఊరిమీదపడి ప్రజలను బాధిస్తుండగా ఆ నాగ్నజితు యెవరైతే వృషభాలను బంధిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని చాటించాడు. పెళ్ళికి ఆశ పడకపోయినా లోకోపకారార్ధం దేవకీ సుతుడు వెళ్లి అనాయాసంగా వృషభాలను బంధించాడు. రాజుగారు అన్నమాట ప్రకారం తన కుమార్తె నాగ్నజితినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు.

కాళింది :    కాళింది సూర్యుని కూతురు . విష్ణు మూర్తి నే భర్తగా చేసుకోవాలని తపస్సు చేసిన పుణ్య స్త్రీ  కాళింది. శ్రీ కృష్ణుడు అతని భావ మరిది అయిన అర్జునుడు కలిసి నదిలో స్నానం చేయదని కి వెళ్ళినప్పుడు ఈ కాళింది కృష్ణుడిని కామ వాంఛ తో చూసింది. ఆ సమయం లో అర్జునుడు ఆమెను చూసి వివరాలు అడిగి తెలుసుకొని కృష్ణునికి చెప్తాడు. కృష్ణుడు ఆమెను ద్వారక కు తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. 
  మిత్రవింద:     శ్రీ కృష్ణుని మేనత్త కూతురు. అవంతీ దేశాధీశులు, యోధానుయోధులు, ధర్మాత్ములు అయిన విందాను విందుల చెలియలు. రాధాదేవి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరమాల వేసి వరించిందీమె.

భద్ర :            శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక. ఈమె సకల సలక్షణ సమన్విత. జాగ్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణునికి యిద్దరు భార్యలు మేనరికం.

లక్షణ :           బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యము నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. ఆమె తండ్రి ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికి కూతురుని ఇస్తానని చాటించాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక నందనందనుడు సునాయాసంగా మత్స్యాన్ని పడేశాడు. లక్షణ తన లక్ష్యం సిద్ధించిందని ఆనందించి వరమాల వేసి వరించింది. శ్రీకృష్ణుడు తనకు అడ్డు వచ్చిన రాజులందరినీ యెదురించి లక్షణని తీసుకుని ద్వారక చేరాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి