3, జనవరి 2012, మంగళవారం

పద్యాలు

                             -:  పద్యాలు :-
 ౦౧      ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
            నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
            నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
            నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
 
 ౦౨        ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
           యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
           బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
           డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

౦౩      .సాయంకాలములం దదీశ మురజి త్సద్మస్వనద్దుందుభి
           స్ఫాయత్కాహళికాప్రతిస్వనత దోఁప న్గుంజగర్భంబుల
          న్ర్మోయుం గేళివనిం గులాయ గమన ప్రోత్తిష్ట ద న్తస్సర
           స్స్థాయి శ్వేతగరు ద్గరుత్పటపటాత్కారంబుఁ గ్రేంకారమున్

౦౪       వరమున బుట్టితిన్‌, భరత వంశము జొచ్చితి నందు పాండు భూ
           వరునకు కోడలైతి జన వంద్యుల బొందితి నీతి విక్రమ
           స్థిరులగు పుత్రులన్‌ బడసితిన్‌ సహ జన్ముల ప్రాపు గాంచితిన్‌
           సరసిజ నాభ ! యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాన నెంతయున్‌ !

౦౫       ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
            నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ
            ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
            పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!
           

                                                                                                             -- గండ్ర మహేష్.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి